![]() |
![]() |
.webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. అందులో రాఘవ స్కిట్ ప్రోమో మాత్రమే వేరే లెవెల్. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ కూడా ఆ స్కిట్ లో ఉన్నారు. రాఘవ న్యూస్ పేపర్ చదువుతూ "డ్రైవర్ కావలెను" అన్న జాబ్ ఆఫర్ చూసి అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళాడు. "అమ్మా నమస్తే అమ్మ" అనేసరికి "ఎవరు నువ్వు" అని అడిగింది. "డ్రైవర్ ని" అన్నాడు రాఘవ. "స్క్రూ డ్రైవర్ అంత లేవు నువ్వెంట్రా డ్రైవర్" అని అన్నారిపూర్ణమ్మ వేసిన ఒక్క పంచ్ డైలాగ్ తో రాఘవ పరువు పోయింది. "గ్యారేజ్ లోకి పోయి బండి ఉంటాది ..ఒట్టుకొచ్చెయ్" అంది. ఇక రాఘవ ఫుల్ జోష్ తో రిక్షా పట్టుకొచ్చాడు. "గ్యారేజ్ లో బండి అన్నారు అక్కడ రిక్షా తప్ప ఎం లేదమ్మా" అన్నాడు రాఘవ. "మరి రిక్షాకె నిన్ను పిలిచినాను.
రిక్షా తొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వచ్చేత్తానని దేవుళ్ళకు మొక్కేసుకున్నాను" అంది అన్నపూర్ణమ్మ. దానికి రాఘవ ఊపిరి పీల్చుకుని "హమ్మా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేవరకు నాకో పది రోజులు సెలవు దొరుకుతుంది" అన్నాడు రాఘవ. "అలగెలగా. తీర్థయాత్రలకు రిక్షాలో వత్తానని దణ్ణమెత్తుకున్నారా" అంటూ కౌంటర్ వేసింది అన్నపూర్ణమ్మ. ఆ మాటలకు నోరెళ్లబెట్టాడు రాఘవ. ఇక ఈ షోలో రాకింగ్ రాకేష్ లేడీ గెటప్ వేసుకొచ్చి స్కిట్ చేసాడు. ఇక అప్పారావు ఐతే చిన్నపిల్లాడి గెటప్ లో వచ్చాడు. ధన్ రాజ్ ని ఒక రేంజ్ లో ఆదుకున్నాడు. తెలుగు అక్షర మాలలో బండిరాని తీసేసారు కదా తీసేసిన బండిరా ఎక్కడ పెట్టారు అంటూ చేసిన ఫన్ మాములుగా లేదు. ఇక రియాజ్ ఐతే గంగూభాయ్ గెటప్ లో వచ్చాడు.
![]() |
![]() |